
ఒకప్పుడు హీరోగా, ఇప్పుడు విలక్షణ నటుడుగా సుమన్ పలు భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా సుమన్ మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రమోట్ చేస్తూ దానియొక్క ఆవశ్యకతను అందరికీ చెబుతున్నాడు. ముఖ్యంగా లేడీస్, ఇప్పటి యువతరం మార్షల్ ఆర్ట్స్ కచ్చితంగా నేర్చుకోవాలని అంటున్నాడు.
‘మార్షల ఆర్ట్స్ వల్ల మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడం కాకుండా బాడీ కూడా చాలా ఫిట్ గా ఉంటుంది. ప్రస్తుత ప్రపంచంలో ఉన్న అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని’ జగ్గారెడ్డి గూడెంలో జరిగిన ఓ కుంగ్ ఫో ఈవెంట్ లో సుమన్ అన్నాడు. ప్రస్తుతం సుమన్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు.

