యు ట్యూబ్ లో దుమారం లేపుతున్న మహేష్ బాబు

యు ట్యూబ్ లో దుమారం లేపుతున్న మహేష్ బాబు

Published on Aug 11, 2014 4:12 PM IST

Aagadu-(2)
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో 2 పాటల షూటింగ్ కోసం నార్వే వెళ్లనున్నారు. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఈ సినిమా సెకండ్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ లోని పంచ్ డైలాగ్స్ కి, మహేష్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అంతే కాకుండా ఈ టీజర్ యు ట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. ఆగష్టు 8వ తేదీ సాయంత్రం విడుదలైన ఈ టీజర్ కి కేవలం రెండు రోజుల్లో 6,18,973 క్లిక్స్ వచ్చాయు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తమన్నా హీరోయిన్ గా కనిపించనున్న ఈ మూవీలో శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్ టైనర్ ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. ఆగష్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియోని రిలీజ్ చేసి సెప్టెంబర్ 19న మూవీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా వార్తలు