
వివి వినాయక్ దర్శకత్వం వహించిన ‘అల్లుడు శీను’ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ అయ్యింది. అలాగే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దాంతో ఈ సినిమాలో నటించింది కొత్త హీరో అయినప్పటికీ మంచి రెవిన్యూ వస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ మరియు తమిళ చిత్ర సీమను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం బయ్యర్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ కోసం బయ్యర్స్ ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
బెల్లంకొండ సురేష్ తన కొడుకు సినిమా కావడం వల్ల భారీ బడ్జెట్ పెట్టారు. కానీ ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ మరియు రీమేక్ రైట్స్ కోసం వస్తున్నా ఆఫర్స్ చూసి చాలా ఆనందంగా ఉన్నాడు.

