‘రుద్రమదేవి’ షూటింగ్ పూర్తి చేసిన ప్రకాష్ రాజ్.

‘రుద్రమదేవి’ షూటింగ్ పూర్తి చేసిన ప్రకాష్ రాజ్.

Published on Aug 12, 2014 4:25 PM IST

prakash-raju1

గుణ టీం వర్క్స్ పతాకంఫై దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క టైటిల్ రోల్ పోషిస్తుంది. రానా అనుష్కకు జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో శివదేవయ్యగా ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజుతో ‘రుద్రమదేవి’ సినిమాలో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు ప్రకాష్ రాజ్. తెలుగు ప్రజలు అందరూ గర్వపడే సినిమాను గుణశేఖర్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని ప్రకాష్ అన్నారు.

ఇండియాలో తొలి సారిగా హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ టెక్నాలజీలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి’ ఎలా ఉండబోతుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాథరిన్ త్రేసా నటిస్తుంది. కృష్ణం రాజు, సుమన్, వినోద్, నిత్యా మీనన్ తదితరలు నటిస్తున్నారు. సినిమా నిర్మాణంలో గుణశేఖర్ ఎక్కడా రాజీ పడకుండా భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు