త్వరలో సురేష్ బాబు సినిమా పాఠాలు..!

త్వరలో సురేష్ బాబు సినిమా పాఠాలు..!

Published on Aug 12, 2014 11:06 PM IST

suresh-babu

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన డి.సురేష్ బాబు యువ రచయితలకు దిశా నిర్దేశం చేయనున్నారు. త్వరలో ఔత్శాహిక దర్శకులు, రచయితలకు రామానాయుడు స్టూడియోస్ ఆధ్వర్యంలో స్క్రిప్ట్ రైటింగ్, మూవీ మేకింగ్ తదితర అంశాలపై వర్క్ షాప్ నిర్వహించనున్నారు. వర్క్ షాప్ నిర్వహించే తేది, ఎలా హాజరుకావాలి అనే విషయాలను త్వరలో వెల్లడించనున్నారు. అప్ కమింగ్ రైటర్స్ కి ఇదొక చక్కని అవకాశం.

సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని, చిన్న సినిమానా..? పెద్ద సినిమానా..? అనే విషయాలు ఆడియన్స్ పట్టించుకోరు. తెలుగు సినిమా పరిశ్రమను ఆ నాలుగు కుటుంబాలే శాసిస్తున్నాయి, ధియేటర్లు వారి చేతిలో పెట్టుకుని చోటా నిర్మాతలను వేదనకు గురి చేస్తున్నారు అంటూ మమ్మల్ని నిందించడం, మాపై ఆరోపణలు చేయడం తగదు. అది మంచి పద్దతి కాదు. ఇటివల విజయం సాదించిన రన్ రాజా రన్, గాలిపటం, గీతాంజలి సినిమాలు చిన్న సినిమాలే. వాటిని ప్రేక్షకులు ఆదరించారు. ఇదొక ఉదాహరణ అని సురేష్ బాబు అన్నారు. ఇండస్ట్రీలో రచయితల కొరత ఉంది. నేను కూడా చిన్న సినిమాలను నిర్మించాలి అనుకుంటున్నాను. మంచి కథ దొరకడం లేదు. అందుకే స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు.

తాజా వార్తలు