
తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ హీరో ఇమేజ్ ఉన్న ఉన్న సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘అంజాన్’. ఇదే సినిమా తెలుగులో ‘సికందర్’ గా విడుదల కానుంది. ఆగష్టు 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఎన్. లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సూర్య సరసన అందాల భామ సమంత హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా గురించి సమంత మాట్లాడుతూ ‘ఈ సినిమాకి మేజర్ హైలైట్ సూర్యనే అవుతాడు. ఆయన సింగిల్ గా అందరినీ ఆకట్టుకుంటాడు. ఇకపోతే మామూలుగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ కి పెద్దగా రోల్ ఉండదని తెలిసినా ఒప్పుకుంటాం.. కానీ ఈ సినిమా మాత్రం కేవలం లింగుస్వామి కోసం ఒప్పుకున్నాను. ఎందుకంటే లింగుస్వామి ప్రతి సినిమాలో హీరోయిన్ ఉండేది కొద్దిసేపే కానీ ఆడియన్స్ మదిలో మాత్రం బాగా గుర్తుండి పోతుంది. అందుకే ఈ సినిమా చేసానని’ తెలిపింది.
అలాగే తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘ఇందులో నా పాత్ర పేరు జీవ. సీరియస్ గా సాగే ఈ సినిమాలో నా పాత్ర కాస్త ఫన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకూ అన్ని పక్కింటి అమ్మాయిలా ఉండే పాత్రలే చేసాను. సమంత ఎలాంటి పాత్రలన్నా చెయ్యగలదు అనేదాని కోసమే ఈ మూవీలో గ్లామరస్ గా కనిపిస్తాను, ఓ పాటలో ఫుల్ మాస్ గా కనిపిస్తానని’ తెలిపింది.

