
ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రకాష్ రాజ్ ప్రయాణిస్తున్న కారు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. మాదాపూర్ నుండి శంషాబాద్ వెళ్తున్న సమయంలో అయన కారును వెనుక నుండి వస్తున్న ప్రవేట్ ట్రావెల్స్ బస్సు డీ కొట్టింది. ఈ ఘటనలో ప్రకాష్ రాజ్ కు స్వల్ప గాయలయ్యాయి. చేతులు, కాళ్ళకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అదే బస్సు మరో ఆటోను కూడా డీ కొట్టడంతో అందులో ప్రయాణికులు రోడ్డు మీద పడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న యువకులు స్పందించిన తీరు భాదించిందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. సంఘటన స్థలంలో భాదితులను రక్షించడం మానేసి, ఫోటోలు తీసుకుంటున్న యువతను చూసి సిగ్గు వేసింది. మానవత్వం లేని ఆ మనుషులను చూసి భయమేసింది. టెక్నాలజీని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం..? మృత్యువు ఒడి నుండి బయటపడ్డా.. మన సమాజంలో జనాలను చూస్తే భయమేస్తుంది. అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

