స్విస్ లో స్టెప్స్ మొదలు పెట్టిన మహేష్ బాబు

స్విస్ లో స్టెప్స్ మొదలు పెట్టిన మహేష్ బాబు

Published on Aug 14, 2014 3:05 AM IST

Aagadu-(2)

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాలో మిగిలి ఉన్న రెండు పాటలని యూరప్ లో షూట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి స్విట్జర్ ల్యాండ్ లో ఓ సాంగ్ షూటింగ్ ని మొదలు పెట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు – తమన్నా ఈ పాట కోసం స్టెప్పులేస్తున్నారు.

ఈ యూరప్ షెడ్యూల్ ఆగష్టు 25 కల్లా పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ చిత్ర టీం ఇండియాకి తిరిగి రానుంది. ఆగష్టు 28న అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా ఈ మూవీ ఆడియోని శిల్పకళా వేదికలో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఇండియా తిరిగి రాగానే మహేష్ బాబు తన పార్ట్ కి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించిన నటీనటులకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. శ్రీను వైట్ల డైరెక్టర్. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు