అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ కి సూపర్బ్ రెస్పాన్స్

అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ కి సూపర్బ్ రెస్పాన్స్

Published on Aug 14, 2014 1:16 PM IST

iam-that-change
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సమాజం కోసం, సమాజంలో మన బాధ్యత ఏమిటి అనేది మనకు చూపించాలనే ఉద్దేశంతో తన స్వీయ నిర్మాణంలో, తను నటిస్తూ ‘ఐ యామ్ దట్ చేంజ్’ అనే షార్ట్ ఫిల్మ్ ని తీసాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ని స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. కానీ ఈ రోజు మీడియా వారికి ప్రత్యేకంగా ఈ షార్ట్ ఫిల్మ్ ని చూపించారు.

చూసిన ప్రతి ఒక్కరూ చాలా టిపికల్ పాయింట్ ని డైరెక్టర్ సుకుమార్ చాలా సూపర్బ్ గా డీల్ చేసారని అంటున్నారు. అలాగే డైరెక్ట్ చేసిన సుకుమార్ పై, ఇలాంటి షార్ట్ ఫిల్మ్ చెయ్యాలని ఆలోచించిన అల్లు అర్జున్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ లపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ ని ఈ రోజు రాత్రి 8:30 గంటలకు యు ట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. మరి విమర్శకుల ప్రశంశలు అందుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని ఆశిద్దాం..

తాజా వార్తలు