
మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు జ్యోతిక. ‘సికిందర్’ సూర్యను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత జ్యోతిక నటనకు విరామం ఇచ్చారు. గత కొని రోజులుగా జ్యోతిక రీ ఎంట్రీ సినిమా గురించి పలు వార్తలు వచ్చాయి. చాలా మంది దర్శకులు కథలు వినిపించారు. అవేమి జ్యోతికను ఇంప్రెస్ చేయలేకపోయాయి. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ చెప్పిన కథ నచ్చడంతో 7 ఏళ్ళ తర్వాత తిరిగి ముఖానికి మేకప్ వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మెసేజ్ కూడిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. విమెన్ ఎంపవర్’మెంట్(మహిళల సాధికారిత) అంశంపై సినిమా నడుస్తుంది.
ఈ ఏడాది మే నెలలో విడుదలై ఘన విజయం సాదించిన మలయాళ సినిమా ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన రోషన్ ఆండ్రూస్ తమిళంలో కూడా దర్శకత్వ భాద్యతలు నిర్వహించనున్నారు. విశేషం ఏంటంటే… మలయాళంలో ఒకప్పటి హీరోయిన్ మంజు వారియర్ 15 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు.

