సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఆగడు’. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 9న ఈ చిత్ర సెకండ్ టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. అతి తక్కువ గ్యాప్ లోనే ఈ చిత్ర టీం ‘ఆగడు’ మరో టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. రేపు స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా ఈ చిత్ర టీం ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగడు మూడవ టీజర్ ని రేపు ఉదయం 7 గంటలకు రిలీజ్ చేయనుంది.
టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఆగడు సినిమా షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్ల్యాండ్ లో జరుగుతోంది. అక్కడ మహేష్ బాబు – తమన్నాల్పి రెండు పాటలను షూట్ చేస్తున్నారు. ఆగష్టు 25 వరకూ అక్కడే షూటింగ్ జరుగుతుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని ఆగష్టు 28న శిల్పకళావేదికలో రిలీజ్ చేయనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.


