
సూపర్ స్టార్ రజినీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా నటినటులుగా కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘లింగా’ ఈ సినిమాలో రజినీకాంత్ ఇంజనీర్ గా, దొంగగా డ్యూయల్ రోల్లో నటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు రజిని. మొదట సినిమా దీపావళికి విడుదల అవుతుందని వార్తలు వచ్చినా అవి నిజం కాదని చెప్పారు. బెంగుళూరు లోకల్ మీడియాతో మాట్లాడిన రజినీకాంత్.. తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ‘లింగా’ విడుదల అవుతుందని ప్రకటించారు. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అభిమానులు ఇప్పటి నుండి సంబరాలు చేసుకోవడానికి రెడీ అయ్యారు.
‘లింగా’ సినిమా తాజా షెడ్యూల్ ఆగస్ట్ 18 నుండి చెన్నైలో ప్రారంభం అవుతుంది. ‘రోబో’ సినిమాలో రజినీకాంత్ ను అందంగా చూపించిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. ఏఅర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

