
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కనున్న సినిమాలో విలన్ పాత్ర కోసం యాక్షన్ హీరో అర్జున్ ను సంప్రదించారు. అర్జున్ నటించడం దాదాపు ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉందట. ‘ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా గురించి చెప్పారు. ఇంకా ఆయన నన్ను కలవలేదు. కథ చెప్పలేదు. కథ విన్న తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుంటాను ‘ అని ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘రేసుగుర్రం’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్, ‘అత్తారింటికి దారేది’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కలసి చేస్తున్న నెక్స్ట్ సినిమా ఇది. వీరిద్దరి ‘జులాయి’ సినిమాని మనకు అందించిన కె. రాధాకృష్ణ ఈ సినిమాకి నిర్మాత కావడంతో అంచనాలు భారిగా ఉన్నాయి. వాటిని అందుకునేలా స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. సమంత ఒక హీరోయిన్. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

