
‘అల్లుడు శీను’ సినిమాలో తన నటనతో ఇండస్ట్రీ పెద్దలనే కాక సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.ఈ యువ నటుడి రెండవ సినిమా కూడా ఇటీవలే ఖరారయ్యింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా వుంటుంది.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.మొదట్లో శ్రీనివాస్ సరసన శృతిహాసన్ ని అనుకున్నారట
తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రని తమన్నా భర్తీ చేయనుందట. అయితే ఈ వార్తని ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఇప్పటికే అల్లుడు శీను సినిమాలో తమన్నా ఒక హాట్ ఐటెం సాంగ్ లో శ్రీనివాస్ పక్కన ఆడిపాడింది. ప్రస్తుతం తమన్నా ‘ఆగడు’, ‘బాహుబలి’ వంటి సినిమాలలో నటిస్తుంది.

