పొల్లాచ్చిలో ‘పండగ చేస్కో’…

పొల్లాచ్చిలో ‘పండగ చేస్కో’…

Published on Aug 17, 2014 3:05 AM IST

ram-pothineni
‘బలుపు’తో హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘పండగ చేస్కో’. యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ పొల్లాచ్చిలో నేడు ప్రారంభం అయింది. హీరో హీరోయిన్లపై ఒక పాటతో పాటు గ్రామీణ వాతావరణ నేపధ్యంలో సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

అమెరికా నుండి ఇండియా వచ్చిన ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ నటిస్తున్నారు. రామ్ సరసన ‘లెజెండ్’ ఫేం సోనాల్ చౌహాన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. వెలిగొండ శ్రీనివాస్ కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు