పెళ్లిని సీరియస్ గా తీసుకోలేదంటున్న నాగ చైతన్య

పెళ్లిని సీరియస్ గా తీసుకోలేదంటున్న నాగ చైతన్య

Published on Aug 19, 2014 5:14 PM IST

naga-chaitanya

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ హీరోస్ లో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకరు. నాగ చైతన్యని పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని అడిగితే పెళ్ళనే దాన్ని ఇంకా సీరియస్ గా తీసుకోలేదని అంటున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ ‘పెళ్ళనే టాపిక్ ఇంట్లో పలు సార్లు వచ్చింది. కానీ నేనే ఇప్పటికీ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. మీకు ఎప్పుడైతే 27 వయసు వస్తుందో అప్పటి నుంచి ఇంట్లో పెళ్లి గంటలు మొదలు పెడతారని(నవ్వులు)’ అన్నాడు.

నాగ చైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ వారు నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటివరకూ ఈ చిత్రంలోని మూడు పాటలను రిలీజ్ చేసారు. ఆ పాటలకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజా వార్తలు