3వ సినిమా మొదలు పెట్టడానికి సిద్దమైన సాయి ధరమ్ తేజ్

3వ సినిమా మొదలు పెట్టడానికి సిద్దమైన సాయి ధరమ్ తేజ్

Published on Aug 19, 2014 6:48 PM IST

sai-dharam-tej

మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమాకి పరిచయం కానున్న మరో హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా ‘రేయ్’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినప్పటికీ ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇది కాకుండా సాయి ధరమ్ తేజ్ నటించిన రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

ఇవి రెండు రిలీజ్ కాకముందే సాయి ధరమ్ తేజ్ తన మూడవ సినిమాని సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సిద్దమవుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని అల్లు అరవింద్ – దిల్ రాజు కలిసి నిర్మించనున్నారు. ఈ విషయం గురించి, మిగిలిన టెక్నీషియన్స్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తాజా వార్తలు