
‘మౌనమేలనోయి’, ‘ఓరేయ్ పండు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన సచిన్ జోషికి ఆ సినిమాలు పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఆషికి 2’ రీమేక్ ‘నీజతగా నేనుండాలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత శుక్రవారం విడుదలైన ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ మల్టీప్లెక్స్ మరియు ఏ సెంటర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సచిన్ జోషికి తెలుగులో మంచి గుర్తింపును తెచ్చింది. అలాగే సచిన్ పెర్ఫార్మన్స్ కి అటు విమర్శకుల నుండి, ఇటు ఆడియన్స్ నుంచి ప్రశంశలు దక్కాయి. ఈ గుర్తింపుకి ప్రత్యక్షంగా సచిన్ నటనలో చూపించిన ఇంప్రూవ్ మెంట్ అయితే, పరోక్షంగా బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ బ్రాండ్ హెల్ప్ అయ్యింది. ఎందుకంటే ఇదే సినిమాని వేరెవరన్నా తీసి ఉంటే ఈ రేంజ్ పబ్లిసిటీ చేసి ఉండేవారు కాదు. బండ్ల గణేష్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరికీ రీచ్ అయ్యేలా ప్రమోట్ చెయ్యడంతో సచిన్ జోషికి తెలుగులో మరింత గుర్తింపు వచ్చింది.
నజియా హుస్సేన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జయ రవీంద్ర డైరెక్టర్. మ్యూజికల్ లవ్ స్టొరీ గా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

