
ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కు ప్రపంచ సంగీత దిగ్గజం, పాప్ మ్యూజిక్ కింగ్ మైకేల్ జాక్సన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంగీతంలో ఎప్పటికప్పుడు కొత్త ట్యూన్లను అందిస్తూ, సరికొత్తగా, ట్రెండీగా ఆలోచించే దేవి… ఈ ఏడాది తన ఫేవరెట్ మైకేల్ జాక్సన్ పుట్టిన రోజు ఎంతో మెమరబుల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని ఇదివరకే చెప్పాం.
ఈరోజు మైకేల్ జాక్సన్ పుట్టిన రోజు సందర్భంగా ‘జల్సా – యంజె’ అనే వీడియో ఆల్బంను దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేసారు. మైకేల్ జాక్సన్ కు దేవి శ్రీ అందిస్తున్న ఈ ట్రిబ్యూట్ వీడియోను దేవి శ్రీ ప్రసాద్ అఫీషియల్ యుట్యూబ్ ఛానల్ www.youtube.com/ThisIsDSPMusic ద్వారా విడుదల చేసారు. టెక్నాలజీతో ముడిపడి ఉన్న పెర్ఫార్మన్స్ తో కూడిన ఈ వీడియోను తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు.

