నమ్రత చేతిపై మహేష్ బాబు టాటూ..

నమ్రత చేతిపై మహేష్ బాబు టాటూ..

Published on Aug 31, 2014 4:00 PM IST

namartha
తన భర్త సూపర్ స్టార్ మహేష్ బాబు, పిల్లలపై నమ్రత శిరోద్కర్ కు ఎంత ప్రేమ ఉందొ మరోసారి ప్రపంచానికి తెలిసింది. శనివారం జరిగిన ‘ఆగడు’ ఆడియోకు హాజరయిన నమ్రత శిరోద్కర్ చేతిపై ఉన్న టాటూను ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఇప్పుడు ఈ టాటూ టాక్ అఫ్ ది ఇంటర్నెట్ అయ్యింది.

నమ్రత శిరోద్కర్ కుడి చేతిపై దేవనాగరి లిపిలో ఇంగ్లీష్ అక్షరాలతో మహేష్ బాబు టాటూ పొడిపించుకున్నారు.మహేష్ పేరు కింద కుమారుడు గౌతమ్, కుమార్తె సితార పేర్లను టాటూ వేయించుకున్నారు. కుటుంబం పట్ల ప్రేమను టాటూ రూపంలో వెల్లడించారు. పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ కోసం తన నటనకు గుడ్ బై చెప్పారు నమ్రత. మంచి భార్యగా, తల్లిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.

తాజా వార్తలు