హ్యాపీ బర్త్ డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

హ్యాపీ బర్త్ డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Published on Sep 2, 2014 8:50 AM IST

Pawan-Kalyan-1
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ స్టార్డం, భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ మొదటి నుంచి తన టాలెంట్, స్టైల్ తో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఈ రోజు. 1971 సెప్టెంబర్ 2న వెంకట్ రావు – అంజన దేవి దంపతులకు జన్మించిన పవన్ నేడు తన 43వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.

1996లో ‘అక్కడ అబ్బాయ్ ఇక్కడ అమ్మాయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తను చేసిన ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘సుస్వాగతం’, ‘బద్రి’, ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్డం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడి సినిమాలు నిరుత్సాహపరిచినా 2012 లో ‘గబ్బర్ సింగ్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు, ఆ తర్వాత 2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఇండస్ట్రీ రికార్డ్ సాధించాడు.

నటుడిగానే కాకుండా ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నికల్లో సెంట్రల్ లో బిజెపికి, రాష్రంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఎన్నికల ప్రచారంలో ఎంతో దూకుడుగా వ్యవహరించి ఆ పార్టీల గెలుపుకి అతను ఓ కారణమయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెంకటేష్ తో కలిసి చేస్తున్న ‘గోపాల గోపాల్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యాక ‘గబ్బర్ సింగ్ 2’ సెట్స్ పైకి వెళుతుంది. సినిమాలతో పాటు తన జనసేన పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎంత స్టార్డం ఉన్నా చాలా సింపుల్ గా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు