మేరే ప్యారే సందీప్.. ‘స్పిరిట్’ కోసం తన వంతు సిద్ధమంటున్న ధురంధర్ దర్శకుడు!

మేరే ప్యారే సందీప్.. ‘స్పిరిట్’ కోసం తన వంతు సిద్ధమంటున్న ధురంధర్ దర్శకుడు!

Published on Apr 10, 2026 1:05 AM IST

sandeep-reddy-vanga-and-pra

ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో వినిపిస్తున్న యంగ్ అండ్ స్టార్ దర్శకుల పేర్లలో టాలీవుడ్ నుంచి సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ నుంచి తాజాగా ఆదిత్య ధర్ లు కూడా ఉన్నారు. ఇక ఆదిత్య రీసెంట్ గా ఇచ్చిన బ్యాక్ టు బ్యాక్ బ్యాంగర్ హిట్స్ ధురంధర్ తో సందీప్ రెడ్డి వంగ తనని ఆకాశానికి ఎత్తేసాడు. మొదట ఓసారి మళ్లీ ఇప్పుడు కూడా మరింత మాస్ గా చెప్పడంతో ఆదిత్య ధర్ ఆనందం వ్యక్తం చేస్తూ సందీప్ కి రిప్లై ఇవ్వడం జరిగింది.

మేరే ప్యారే సందీప్ అంటూ మీరు నిలబడే తీరు మీ నిజాయితీకి నేనెప్పుడూ గౌరవం ఇస్తాను. ఎలాంటి బెరుకు లేకుండా మీరు సినిమా కోసం ఎలా నిలబడతారో నేనెప్పుడూ గమనిస్తూనే ఉంటాను. లెజెండ్ ప్రభాస్ గారికి నా ప్రేమను అందజేయండి.. మీ స్పిరిట్ కోసం చాలా ఎదురు చూస్తున్నాను. ఆ సినిమాకి ఆల్ ది బెస్ట్ అంటూ అలాగే నా వంతుగా మీకేమయినా సహాయం కావాలి అంటే తప్పకుండా మీకోసం జెన్యూన్ గా సహకారాన్ని అందిస్తాను అని చెప్పడం ఇందులో మరో హైలైట్ గా నిలిచింది. దీనితో ఈ క్రేజీ కలయిక విషయంలో అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు.

తాజా వార్తలు