
కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న తాజా హారర్ – కామెడీ సినిమా ‘ముని 3 – గంగ’. తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట తమన్ పేరు వినిపించింది. తర్వాత తమన్ స్థానంలో ‘కొలవేరి డి’ ఫేం అనిరుధ్ వచ్చి చేరాడు. అయితే ‘ముని 3 – గంగ’ సినిమాకు ఐదుగురు సంగీత దర్శకులతో పాటలను కంపోజ్ చేయించాలని రాఘవ లారెన్స్ ప్రయత్నిస్తున్నారు.
‘ముని 3 – గంగ’ సినిమాలో సంగీతానికి పెద్దగా ప్రాముఖ్యత లేదని తెలుసు. కాని ప్రేక్షకులకు కొత్త తరహా సంగీతం వినిపించాలని ప్రయోగం చేస్తున్నాను. ‘ముని 3’కు ఐదుగురు సంగీత దర్శకులతో పని చేయాలని నిర్ణయించుకున్నాను. అని రాఘవ లారెన్స్ తెలిపారు.
ఒక హారర్ – కామెడీ సినిమా ఐదుగురు సంగీతం అందించడం బహుశా ఇదే ప్రధమం. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్. నిత్యా మీనన్ కీలక పాత్ర పోషిస్తుంది. బెల్లంకొండ సురేష్ నిర్మాత.

