
‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాతో తెలుగు వారి హృదయాలు కొల్లగొట్టిన హీరోయిన్ మళయాళకుట్టి అసిన్. ఆ తర్వాత సౌత్ ఇండియన్ భాషలలోని స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని టాప్ హీరోయిన్ గా నిలిచింది. అదే తరుణంలో బాలీవుడ్ లో నటించే అవకాశం రావడంతో తన మొత్తం మకాం ముంబైకి మార్చేసి, సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
బాలీవుడ్ లో అసిన్ కి సూపర్ హిట్స్ వచ్చినప్పటికీ ప్రస్తుతం తన చేతిలో ఒకే ఒక్క సినిమా తప్ప మరో సినిమా లేదు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ లో సరైన అవకాశాలు లేకపోవడంతో అసిన్ మళ్ళీ సౌత్ పై దృష్టి సారించింది. తాజాగా అసిన్ తన సోషల్ నెట్వర్క్ ద్వారా త్వరలో సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ కి ఒక శుభవార్త చెప్పనున్నానని తెలిపింది. దాంతో అసిన్ కి సౌత్ లో ఆఫర్ వచ్చిందని ఖరారు చేసుకున్నారు. మరి ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

