ఆరడుగుల పొడవు, పర్ఫెక్ట్ పిజిక్ తో ఉండే హీరో గోపీచంద్ కి టాలీవుడ్ లో మాస్ యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. గోపీచంద్ క్రియేట్ చేసుకున్న ఈ ఇమేజ్ తనకి కెరీర్ మొదటి నుంచి హెల్ప్ అయ్యింది. కానీ ఈ ఇమేజ్ వల్ల కాస్త రూటు మార్చి డిఫరెంట్ సినిమాలు చెయ్యాలనుకుంటే గోపీచంద్ కెరీర్ కి కాస్త ఇబ్బంది అవుతోంది.
తాజాగా గోపీచంద్ తన మేకోవర్ కోసం ‘లౌక్యం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ ని సరికొత్త యాంగిల్ లో కనిపించనున్నాడు. ముఖ్యంగా తనలోని ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ చూపగల నటున్ని తెరపై చూపనున్నారు.
గతంలో గోపీచంద్ తో ‘లక్ష్యం’ సినిమా చేసిన శ్రీ వాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో గోపీచంద్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఆడియోని రిలీజ్ చేసి సెప్టెంబర్ 26న సినిమా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తుండగా, ఎస్ఆర్ శేఖర్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు.


