
వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ‘ చిన్నదాన నీ కోసం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటి వరకూ హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ఓ లాంగ్ షెడ్యూల్ కోసం బార్సెలోన వెళ్ళారు. అక్కడ సుమారు 35 రోజుల పాటు షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుంది.
‘చిన్నదాన నీ కోసం 35 రోజుల షూటింగ్ కోసం బార్సెలోన వెళ్తున్నాం. మిస్సింగ్ ఇండియా’ అని నితిన్ ట్వీట్ కూడా వేసాడు. లవ్ ఎంటర్టైనర్స్ చేయడంలో మంచి పేరున్న కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్ హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కరుణాకరన్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కూడా మిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

