‘పూజై’ కోసం మరో సారి గళం విప్పిన శృతి హాసన్

‘పూజై’ కోసం మరో సారి గళం విప్పిన శృతి హాసన్

Published on Sep 4, 2014 3:30 PM IST

Sruthi-Hasan
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా చెలామణి అవుతోంది. శృతి హాసన్ నటింగానే కాకుండా మంచి సింగర్ కూడా.. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా బిజీగా ఉన్నప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా శృతి హాసన్ కొన్ని సినిమాలకి పాటలు పాడుతూ ఉంటుంది. ఇటీవలే మహేష్ బాబు ‘ఆగడు’ కోసం ఓ పాట పాడిన శృతి హాసన్ మరోసారి తన గొంతు సవరించుకొని పాట పాడటానికి సిద్దమైంది.

కానీ ఈ సారి తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ పాడనుంది. యాక్షన్ హీరో విశాల్, శృతి హాసన్ జంటగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పూజై’. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఓ పాటని పాడటానికి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాట తెలుగు వెర్షన్ కూడా శృతి హాసన్ పాడనుంది. తెలుగులో ‘పూజ’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు