మొదలైన ‘పెసరట్టు’

మొదలైన ‘పెసరట్టు’

Published on Sep 4, 2014 5:54 PM IST

Pesarattu
నందు – నికిత నారాయన్ జంటగా, కత్తి మహేష్ దర్శకత్వం లో క్లాప్ బోర్డ్ స్టుడియో – రాం ప్రియాంక మీడియా ఎంటర్టైన్మెంట్స్ – రిచెజ్జ మీడియా ఎంటర్టైన్మెంట్స్ – పింక్ పాక్డి సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘పెసరట్టు’. ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ లోని గండిపేటలో లాంఛనంగా ప్రారంభం అయింది. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచాన్ చేయగా, మరో దర్శక నిర్మాత స్టీవన్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా టాలీవుడ్ లోనే తొలిసారిగా క్రౌడ్ ఫండింగ్ పద్దతిలో నిర్మాణం జరుపుకుంటోంది. రామ్ గోపాల్ వర్మ.. ఫ్లో-కాం టెక్నాలజీ ని ఇన్స్పిరషన్ గా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో, హీరోయిన్ మినహా నటీనటులందరినీ సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా ఎంపిక చేసుకుని వారం రోజులు వారందరికీ వర్క షాప్ నిర్వహించారు. ఈ రోజు నుంచి సింగిల్ షెడ్యూల్ లో సినిమాని పూర్తి చేసి, అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు