ఓ క్రేజీ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్న రాఘవ లారెన్స్

ఓ క్రేజీ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్న రాఘవ లారెన్స్

Published on Sep 4, 2014 5:56 PM IST

Larence
కొరియోగ్రాఫర్ నుంచినటుడిగా , నటుడు నుంచి దర్శకుడిగా అవతారం ఎత్తిన రాఘవ లారెన్స్ ప్రస్తుతం ‘ముని 3’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రాఘవ లారెన్స్ తన తదుపరి సినిమాని సిద్దం చేసుకున్నాడు. అదికూడా రెండు కథలతో రెండు సినిమాలను ఒకే టికెట్ పై చూపించనున్నాడు. అవును మీరు వింటున్నది నిజమే..

అసలు విషయంలోకి వెళితే ‘టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన వాళ్లకి ఫస్ట్ హాఫ్ లో ఒక సినిమా సెకండాఫ్ లో ఒక సినిమా చూపించనున్నాము. అందుకే దీనికి ఒకే టికెట్ పై రెండు సినిమాలు అనే పేరు పెట్టాం. ఈ రెండు సినిమాలకి ‘ముసలోడు’, ‘ది లేటెస్ట్’ అనే టైటిల్స్ ని ఖరారు చేసామని’ తెలిపాడు. ఈ రెండు సినిమాల్లోనూ లారెన్స్ హీరోగా నటిస్తుంటే, ‘ది లేటెస్ట్’లో లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా నటిస్తుంటే, ‘ముసలోడు’ కోసం ఆండ్రియా జెరేమియాని సంప్రదిస్తున్నారు. ఒక గంట ఇరవై నిమిషాలు ఉండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబెర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు