సెప్టెంబర్ 5న ‘కిరాక్’ – పవన్, మహేష్ అభిమానుల ప్రేమకథ

సెప్టెంబర్ 5న ‘కిరాక్’ – పవన్, మహేష్ అభిమానుల ప్రేమకథ

Published on Sep 4, 2014 9:29 PM IST

Kiraak
‘పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు’ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా యుట్యూబ్లో పాపులర్ అయిన అనిరుధ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘కిరాక్’. ఈ చిత్రంలో అనిరుధ్ పవన్ వీరాభిమానిగా నటిస్తున్నాడు. హీరోయిన్ చాందిని మహేష్ బాబు అంటే పడి చస్తుంది. మరి వీరిద్దరూ ప్రేమలో పడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఇంకెందుకు ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘కిరాక్’ సినిమా చూడాల్సిందే.

హారిక్ దేవభక్తుని దర్శకత్వంలో ‘కిరాక్’ సినిమాను డి.గోపికృష్ణ, గంగపట్నం శ్రీధర్ లు సంయుక్తంగా నిర్మించారు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్. ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తుంది. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళిల కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ 5న విడుదలవుతున్న మా ‘కిరాక్’ను థియేటర్లో చూడండి. ప్రేక్షకుల ఆశీసులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాం అని దర్శకుడు అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు