రుద్రమదేవి’ కోసం 9 సంవత్సరాలు అన్వేషించిన గుణశేఖర్

రుద్రమదేవి’ కోసం 9 సంవత్సరాలు అన్వేషించిన గుణశేఖర్

Published on Sep 7, 2014 1:57 PM IST

Gunashekhar
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ గత కొన్ని రోజులుగా ‘రుద్రమదేవి’ షూటింగ్ లో బిజీగా ఉన్నందువల్ల బయట ఎక్కడా కనిపించనే లేదు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో గుణశేఖర్ మీడియా ముందుకు వచ్చారు.

‘రుద్రమదేవి షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు 2002 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి రీసర్చ్ చేస్తే పూర్తవడానికి 9 సంవత్సరాలు పట్టింది. 2013 లో వరంగల్ లో సినిమా మొదలు పెట్టాను. ఇలాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు. దీని కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఇండియాలో మొట్టమొదటి సారిగా వస్తున్న 3డి స్టీరియోస్కోపిక్ సినిమా ఇదే కావడం గర్వంగా ఉందని’ గుణశేఖర్ అన్నాడు.

అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు