రవితేజ ‘కిక్ 2’లో రకుల్ ప్రీత్ సింగ్.?

రవితేజ ‘కిక్ 2’లో రకుల్ ప్రీత్ సింగ్.?

Published on Sep 7, 2014 2:34 PM IST

raviteja-rakulpreethi
మాస్ మహారాజ రవితేజ కెరీర్లో మైలు రాయిగా నిలిచి పోయే సినిమా ‘కిక్’. నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కిక్ కి సీక్వెల్ గా ‘కిక్ 2’ ని నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకి ప్రస్తుతం సెట్స్ పై ఉంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కిక్ 2 లో రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఎంపిక చేయనున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ వార్తల ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ఈ అవకాశం దక్కించుకుంటే, తను కూడా కిక్ 2 తో స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోతుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి కథ – మాటలు వక్కంతం వంశీ అందిస్తున్నాడు. కిక్ తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కిక్ 2 పై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. కిక్ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలో కూడా రీమేక్ అయ్యి పెద్ద విజయాన్ని అందుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు