పవన్ కళ్యాణ్ బైక్ ఖరీదు : 6.6 లక్షలు

పవన్ కళ్యాణ్ బైక్ ఖరీదు : 6.6 లక్షలు

Published on Sep 24, 2014 1:09 PM IST

pawan-kalyan-bike
పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్న సినిమా ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం బైక్ పై ఉంటుంది. ఇటివలే ఈ సన్నివేశాలను హైటెక్ సిటీ పక్కనే ఉన్న మాదాపూర్ ఫ్లై ఓవర్ మీద చిత్రీకరించారు.

పవన్ కళ్యాణ్ ఎంట్రీ సన్నివేశం కోసం చాలా ఖరీదైన బైక్ వాడినట్లు సమాచారం. 6.6 లక్షల రూపాయలు ఖరీదు చేసే ‘హ్యోసంగ్ జివి 650 ఆక్విలా ప్రో’ బ్లూ కలర్ బైక్ పై ఉంటుంది. ఈ బైక్ ను మరింత స్టైలిష్ గా డిజైన్ చేశారు. ఇంట్రడక్షన్ సన్నివేశంతో పాటు తర్వాత కొన్ని సన్నివేశాలలో పవన్ బైక్ పై సందడి చేయనున్నారు.

వెంకటేష్, శ్రియ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు