AA26 X A6: హాట్ టాపిగ్గా మారిన బీస్ట్ పోస్టర్.. ఎప్పుడో హింట్ ఇచ్చారుగా

AA26 X A6: హాట్ టాపిగ్గా మారిన బీస్ట్ పోస్టర్.. ఎప్పుడో హింట్ ఇచ్చారుగా

Published on Apr 8, 2026 12:02 AM IST

AA22

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న భారీ సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ 26వ సినిమా కూడా ఒకటి. వారణాసి, రామాయణ తరహాలో ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ లో ప్రెజెంట్ చేయడం లేదు కానీ కంటెంట్ మాత్రం ఆ రేంజ్ లోనే సిద్ధం చేస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఎట్టకేలకు బన్నీ పుట్టినరోజు కానుకగా దర్శకుడు అట్లీ ఊహించని ట్రీట్ సిద్ధం చేసాడు. ఒక బీస్ట్ చేతిని రివీల్ చేస్తూ నేడు అనౌన్స్ చేసిన పోస్టర్ హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే ఇది ఎప్పుడో మేకర్స్ హింట్ ఇచ్చారు. సినిమా అనౌన్స్ మెంట్ వీడియో లోనే అల్లు అర్జున్ ఒక సెట్ వర్క్ లాంటి చేతిని తన చేతికి తొడుక్కుని కనిపించాడు.

అయితే ఇతర విజువల్స్ లో భాగంగా ఇదీ సాధారణమే అని అంతా అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే నిజంగానే ఒక పాత్రనే దానితో సృష్టించినట్టు కనిపిస్తుంది. దీనితో ఎగ్జైట్మెంట్ అందరిలో డబుల్ అయ్యింది. ఇలా రేపు వచ్చే ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా టైటిల్ కోసం అంతా మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు