
గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘లౌక్యం’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా చాలా లక్కీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన ఫ్యామిలీ అంతా కలసి చూసే ఎంటర్టైనింగ్ హిట్ సినిమా లేకపోవడం ‘లౌక్యం’కు కలసివచ్చింది. ట్రైలర్స్, ప్రోమోస్ ప్రామిస్సింగ్ గా అనిపించడం, అనూప్ రూబెన్స్ అందించిన హిట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. గోపీచంద్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాదించే సినిమా అవుతుందని అంటున్నారు.
సినిమాలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్ కీలక పాత్రలలో నటించారు. ఇటివల సినిమా చూసిన మూవీ యూనిట్ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. అంతే కాదు.. రచయిత కోన వెంకట్ గుంటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి మరొకరితో కలిసి నెల్లూరు, దర్శకుడు శ్రీవాస్ ఈస్ట్ గోదావరిలో, స్టొరీ రైటర్ శ్రీధర్ సీపాన శ్రీకాకుళంలో రిలీజ్ చేస్తున్నారు.

