మిర్చి, రన్ రాజా రన్ సినిమాల విజయంతో నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ మంచి జోరు మీద వున్నారు. ప్రస్తుతం వీరు గోపీచంద్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను తెరకెక్కించనుంది
మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ సినిమాకు సంగీతదర్శకుడు. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలచేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించడం, గోపీ నటించిన లౌక్యం విజయాన్ని అందుకోవడంతో శుభ పరిణామాల నడుమ ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంటుంది


