
హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు డైరెక్ట్ చేసినచిత్రం ‘అవును’. 2012లో విడుదలైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న ‘అవును 2’ సినిమా షూటింగ్ ఒక నెల రోజుల క్రితమే పూర్తయ్యింది. గత కొన్ని వారాలుగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దాంతో ఈ చిత్ర టీం ఈ సినిమాని అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
‘అవును 2’లో హర్షవర్ధన్ రాణే, పూర్ణలతో పాటు సంజన, నికిత ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలా లో బడ్జెట్ తో తెరకెక్కిన అవును సినిమా నిర్మాతలకి మంచి లాభాన్ని తెచ్చి పెట్టాయి. ఆ సినిమా లానే ఈ సినిమా కూడా హిట్ అయ్యి మంచి లాభాలను తెచ్చి పెతుతుందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం భావిస్తోంది.

