హాలీవుడ్ సినిమాకు చిన్ని కృష్ణ కథ.

హాలీవుడ్ సినిమాకు చిన్ని కృష్ణ కథ.

Published on Oct 3, 2014 1:38 PM IST

Chinni-Krishna
కథా రచయితగా ఆయన పని చేసిన సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ‘గంగోత్రి’, ‘నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’ ఇలా బ్లాక్ బస్టర్ సినిమాలను కథలను అందించారు చిన్ని కృష్ణ. తాజాగా ఒక హాలీవుడ్ సినిమాకు కథను అందించనున్నారు. హాలీవుడ్‌ యాక్షన్ స్టార్ హీరో వాన్‌డెమ్ హీరోగా తన్వీర్ గ్రూప్ నిర్మించనున్న సినిమాకు చిన్ని కృష్ణ కథను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఒక ఇండియన్ సినిమా హీరో కూడా నటిస్తారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ ఫారిన్ లొకేషన్స్ లలో జరుగుతుంది.

సుమారు 500కి పైగా హాలీవుడ్ సినిమాలను ఇక్కడి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన నిర్మాత ఆర్.కె. భగవాన్ చిన్నికృష్ణ పేరును తన్వీర్ గ్రూప్ ఇండియన్ సీఈవో శైలేష్‌ కి సూచించారట. ఇటివల గ్రీస్ వెళ్ళిన చిన్ని కృష్ణ, శైలేష్‌ తో సమావేశం అయ్యారు. ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. 2015, జనవరి లోపు కథ రెడీ చెయ్యాలి. ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్నారు.

తాజా వార్తలు