అక్టోబర్ 12న విజయ్ ‘కత్తి’ తెలుగు ఆడియో

అక్టోబర్ 12న విజయ్ ‘కత్తి’ తెలుగు ఆడియో

Published on Oct 3, 2014 4:24 PM IST

kathi
సౌత్ ఇండియన్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన ఎఆర్ మురుగదాస్ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో ఇలయతలపతి విజయ్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘కత్తి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఆడియో పెద్ద హిట్ అయ్యింది.

ఈ సినిమాని తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేసి ఠాగూర్ మధు రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు మూవీ ఆడియోని అక్టోబర్ 12న హైదరబాద్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 23న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొలవెరి డీ ఫేం అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు. గతంలో మురుగదాస్ – విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ‘తుపాకి’ కి సినిమా ఆపేద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నారు.

తాజా వార్తలు