
‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి హిట్ సినిమాల తర్వాత సాయి కొర్రపాటి మరోసారి యువ టాలెంట్ తో తన వారాహి చలన చిత్రం బానర్ పై నిర్మిస్తున్న సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’. ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం నాగ శౌర్య హీరోగా, సన ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ రోజే ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ వారు ఈ సినిమా ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే క్లీన్ ఎంటర్ తినేర్ కావడం వలన సెన్సార్ వారు ఎలాంటి కట్స్ విధించలేదు. అలాగే ఈ సినిమా రన్ టైంని 2 గంటల 20 నిమిషాలకు లాక్ చేసారు. ఎస్ఎస్ రాజమౌళి దగ్గర పనిచేసిన త్రికోఠి దర్శకుడిగా పరిచయం కానున్న ఈ మూవీని సాయి కొర్రపాటి చాలా గ్రాండ్ గా ఉండేలా తీసారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. అజయ్, నిన్నటి తరం హీరోయిన్ ఇంద్రజ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

