మళ్ళీ బిజీ అయిపోయిన నాని

మళ్ళీ బిజీ అయిపోయిన నాని

Published on Oct 8, 2014 9:47 AM IST

Nani1
గత కొంత కాలంగా విజయాలను మిస్ అయిన యంగ్ హీరో నానికి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తోంది. చాలా రోజులుగా మేకప్ వేసుకొని కెమెరా ముందుకు రాణి నాని త్వరలో వరుసగా షూటింగ్స్ లో పాల్గొననున్నాడు. ప్రసతుతం నాని వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు, అలాగే మరి కొన్ని సినిమాలకు సైన్ చేయాల్సి ఉంది.

ప్రస్తుతం స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ నిర్మిస్తున్న ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ లో ఓ సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ బిజీ షెడ్యూల్స్ వల్ల నాని హ్యాపీ గా ఉన్నాడు. ఒక్కసారి బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అందుకున్నాడు అంటే తన క్రేజ్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఇది కాకుండా నాని తన సొంత నిర్మాణ సంస్థపై కూడా వచ్చే సంవత్సరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు