
సౌత్ ఇండియన్ మూవీ ఫ్యాన్స్ తో పాటు నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఎదురుచూసేలా చేసిన శంకర్ మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఐ’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ముందుగా ఈ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చేద్దామనుకున్నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో నవంబర్ కి వాయిదా వేసారు.
మాకు అందిన న్యూస్ ప్రకారం ఈ సినిమా డబ్బింగ్ కోసం విక్రమ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా విక్రమ్ ఇందులో మూడు పాత్రలు చేయడం వలన ఒక్కో పాత్రలో వైవిధ్యం చూపిస్తూ డబ్బింగ్ చెబుతున్నాడు. అలాగే ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా విక్రమ్ స్వయంగా డబ్బింగ్ చెప్తున్నాడు. సుమారు 180 కోట్ల బడ్జెట్ తో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించగా ఉపేన్ పటేల్ విలన్ గా కనిపించనున్నాడు.

