వీర శంకర్ సినిమాలో అతిధి పాత్ర చేసిన ఎస్ఎస్ రాజమౌళి

వీర శంకర్ సినిమాలో అతిధి పాత్ర చేసిన ఎస్ఎస్ రాజమౌళి

Published on Oct 13, 2014 11:10 AM IST

veera_shnaker_rajamouli (1)
ఇప్పటి వరకూ ఒక దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకూ ఆయన అడపా దడపా ఆయన సినిమా చివరి క్లైమాక్స్ షాట్ లో షాట్ ఓకే అంటూ వచ్చి తెరపై కనపడిన సందర్భాలే తప్ప ఓ సినిమాలో ఒక అతిధి పాత్రలో కనిపించిన దాఖలాలు లేవు. కానీ వాటికి తెరదింపి రాజమౌళి మన కుర్రాళ్ళే అనే సినిమాలో ఒఅ తిది పాత్రలో కనిపించనున్నాడు. అంతే కాకుండా ఆయన సినిమాలో చేస్తున్నది కూడా తన రియల్ లైఫ్ పాత్రే కావడం విశేషం.

వీర శంకర్ దర్శకత్వంలో అరవింద్ కృష్ణ – రచన మల్హోత్రా జంటగా నటించిన సినిమా ‘మన కుర్రాళ్ళే’. రాజమౌళి అతిధి పాత్ర గురించి వీర శంకర్ చెబుతూ ‘ఈ సినిమాలో ఒక స్టార్ హీరో పాత్ర ఉంటుంది. ఆ హీరో ఆడియో ఫంక్షన్ కి హాజరయ్యే అతిధి పాత్రలో రాజమౌళి గారు కనిపిస్తారు. అది చాలా చిన్న పాత్ర కానీ రాజమౌళి గారిని అడగ్గానే ఎక్కువ టైం తీసుకోకుండా చేస్తానని చెప్పారు. ఈ సీన్స్ కోసం ఆయన రాత్రి 8 గంటలకి సెట్స్ కి వచ్చి ఉదయం 3 గంటల వరకూ ఉండి సీన్స్ ని ఫినిష్ చేసి వెళ్ళారు. ఆయనకి నాకు ఉన్న అనుబంధం వల్లే ఆయన ఈ రోల్ చేసాడు. ఈ విషయంలో నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వడమే కాకుండా ఆయనకి స్పెషల్ థాంక్స్చెప్పుకున్తున్నానని’ అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు