
నందమూరి కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘పటాస్’. కళ్యాణ్ రామ్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నా ముందుగా పటాస్ రిలీజ్ చెయ్యాలని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘పటాస్’ సినిమా షూటింగ్ 90% పూర్తయ్యిందని, అలాగే డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా బాగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని కళ్యాణ్ రామ్ తన ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు.
ఈ సినిమాతో రైటర్ అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మిగిలిన 10^% షూటింగ్ ని కూడా త్వరలో పూర్తి చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఇది కాకుండా షేర్ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇవి రెండూ కాకుండా కళ్యాణ్ రామ్ తన ప్రొడక్షన్ బ్యానర్ లో ‘కిక్ 2′ ని నిర్మిస్తున్నారు.

