హుదూద్ బాధితులకి తెలుగు చిత్ర పరిశ్రమ డొనేషన్ డీటైల్స్.!

హుదూద్ బాధితులకి తెలుగు చిత్ర పరిశ్రమ డొనేషన్ డీటైల్స్.!

Published on Oct 14, 2014 5:41 PM IST

alll-heros
ప్రకృతి వైపరీత్యం వలన సంబవించిన హుదూద్ సైక్లోన్ సృష్టించిన విధ్వంసం వలన వైజాగ్ మొత్తం పూర్తిగా దెబ్బతింది. అలాగే ఉత్తరాంధ్రలోని మరో నాలుగు జిల్లాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రాణ నష్టం పెద్దగా జరగకపోయినా ఆస్తినష్టం మాత్రం భారీగా జరిగింది. ఈ సైక్లోన్ ప్రభావం వాళ్ళ నష్టపోయిన వారికి సహాయం అందించాలని ప్రభుత్వం ప్రజలని కోరింది. ఈ రోజు వైజాగ్ ని విజిట్ చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హుదూద్ బాధితుల సహాయార్ధం 1000 కోట్లను ఫండ్ కి ఇస్తున్నట్లు అనౌన్స్ చేసారు.

ఇది కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ నుండి అందరు హీరోలు ముందుకు వచ్చి తమవంతు ధన సహాయం చేయడమే కాకుండా తమ అభిమానులను కూడా వరద బాధితులకు సహాయం చేయమని కోరారు.. టాలీవుడ్ నుంచి హుదూద్ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ కి మన హీరోలు మరియు ఇతరులు విరాళం ఇచ్చిన వివరాలు మీకోసం..

పేరు డొనేట్ చేసిన అమౌంట్
పవన్ కళ్యాణ్ 50 లక్షలు
మహేష్ బాబు 25 లక్షలు
ఎన్.టి.ఆర్ 20 లక్షలు
అల్లు అర్జున్ 20 లక్షలు
రామ్ చరణ్ 15 లక్షలు
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 25 లక్షలు
ప్రతాప్ కలగొట్ల(నిర్మాత) 1 లక్ష

సంబంధిత సమాచారం

తాజా వార్తలు