
‘ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా చూశాను. నాకు సుకుమార్ కాన్సెప్ట్, తెరకెక్కించిన విధానం బాగా నచ్చింది. మంచి ప్రయోగాత్మక సినిమాను తీసినందుకు సుకుమార్ ను అభినందిస్తున్నాము. అతను గొప్ప దర్శకుడు. భవిష్యత్ లో ఇటువంటి ప్రయోగాత్మక సినిమాలు, కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను సుకుమార్ రూపొందిస్తారని ఆశిస్తున్నాను. బన్నీతో చేసిన ‘ఆర్య’ సినిమా కూడా నాకు నచ్చింది. మంచి కథతో వస్తే సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.’ అని అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విజయవంతం అయిన సందర్భంగా గూగుల్ హాంగ్ అవుట్ లో అభిమానులతో రామ్ చరణ్ ముచ్చటించారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఫైవిధంగా స్పందించారు. ‘ఆరెంజ్’ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మంచి కథ వస్తే సినిమా చేయడానికి రెడీ అని అన్నారు. ‘ఆరెంజ్’లో నటించినందుకు తనకేమి రీగ్రేట్స్ లేవని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు చరణ్.

