అమితాబ్ తో వర్క్ చేయాలనుంది – రకుల్ ప్రీత్ సింగ్.

అమితాబ్ తో వర్క్ చేయాలనుంది – రకుల్ ప్రీత్ సింగ్.

Published on Oct 21, 2014 5:49 PM IST

Rakul-Preet_Singh
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలసి నటించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. దీనికి రకుల్ ప్రీత్ సింగ్ అతీతం కాదు. నటనలో ఎవరెస్ట్ శిఖరం వంటి అమితాబ్ తో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

నాకు డ్రీం ప్రాజెక్ట్స్ ఏమి లేవు. జీవితంలో ఒక్కసారైనా అమితాబ్ తో కలసి వర్క్ చేయాలనుంది, కూతురిగా అయినా, మరొక పాత్రలో అయినా బిగ్ బి సినిమాలో నటిస్తాను. డ్రీం రోల్స్ అంటే.. నా పాత్రకు మంచి గుర్తింపు రావాలి. ‘దిల్ వాలా దుల్హనియా లేజాయేంగే’లో కాజోల్ చేసిన సిమ్రాన్, ‘జబ్ వుయ్ మెట్’లో కరీనా కపూర్ చేసిన గీత్ తరహా క్యారెక్టర్ లలో నటించాలని నా కోరిక. అని మనసులో భావాలను వెల్లడించింది.

ఈ ఢిల్లీ డాల్ తెలుగులో నటించిన తొలి రెండు సినిమాలు మంచి విజయం సాదించాయి. ప్రస్తుతం మనోజ్ సరసన నటించిన ‘కరెంట్ తీగ’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంది.

తాజా వార్తలు