
ప్రముఖ హీరో, కింగ్ నాగార్జునను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. క్లీన్ ఇండియా లక్ష్యంగా గాంధీ జయంతి సందర్భంగా మోడీ ‘స్వచ్చ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు అక్కినేని నాగార్జున & ఫ్యామిలీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, అఖిల్, సుశాంత్, అన్నపూర్ణ స్టూడియోస్ ఉద్యోగులు బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో రోడ్లను శుభ్రం చేశారు.
‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా హీరో నాగార్జునకు అభినందనలు తెలిపారు. ‘ప్రముఖ తెలుగు నటుడు నాగార్జున స్వచ్ఛ భారత్ మిషన్ లో పాల్గొన్నారు. క్లీన్ ఇండియా సాధన కోసం మనం చేస్తున్న ప్రయత్నాల వైపు ఇతరులలో స్ఫూర్తి కలిగిస్తుంది.’ అని మోడీ ట్వీట్ చేశారు.


