ఫిబ్రవరికి వాయిదాపడిన బాలకృష్ణ చిత్రం?

ఫిబ్రవరికి వాయిదాపడిన బాలకృష్ణ చిత్రం?

Published on Oct 31, 2014 8:33 AM IST

balakrishna
టాలీవుడ్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ సరికొత్త సినిమా విడుదలని జనవరి నుండి ఫిబ్రవరికి వాయిదావేసే పనిలో వున్నారు.

రుద్రపాటి రామారావు నిర్మాణంలో సత్యదేవా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో త్రిష కధానాయిక. షూటింగ్ లో జరుగుతున్న జాప్యం వలనే ఈ వాయిదాకి కారణమని తెలుస్తుంది.

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. బాలయ్య బాబు హీరోగా చివరిగా విడుదలైన ‘లెజెండ్’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు