గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు శిరీష్ 3వ సినిమా..!

గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు శిరీష్ 3వ సినిమా..!

Published on Oct 31, 2014 2:03 PM IST

Allu-Sirish
‘గౌరవం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు శిరీష్ తన రెండవ సినిమా ‘కొత్త జంట’తో సక్సెస్ అందుకున్నాడు. హోం ప్రొడక్షన్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు ‘కొత్త జంట’ సినిమాను నిర్మించారు. అల్లు ఆశిరీష్ హీరోగా నటించనున్న మూడవ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ 3వ సినిమా కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. హిట్ కాంబినేషన్ రిపీట్ కానుంది.

ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన లైన్ నచ్చడంతో ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. రొమాంటిక్ థ్రిల్లర్ గా ఉంటుందని భావిస్తున్న ఈ సినిమా లుక్ కోసం అల్లు శిరీష్ వర్కౌట్ చేస్తున్నాడు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ఫినిష్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల ఎంపిక జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

తాజా వార్తలు